“కుర్చీ మడత పెట్టి” సాంగ్ లో పూర్ణ కంటే ముందే త్రివిక్రమ్ ఆ హీరోయిన్ ని చూస్ చేసుకున్నాడా.. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..…?

ఆ కుర్చీ మడత పెట్టి .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తున్నారు . ఈ పాటలోని లిరిక్స్ మీనింగ్స్ పక్కన పెడితే .. పాట బీట్ మాత్రం అద్దిరిపోయింది. మంచంలో ఉండే ముసలి వాళ్ళ దగ్గర కూడా స్టెప్స్ వేయించే సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు. కాగా ఇప్పుడు ఏ పార్టీ అయినా ..ఏ ఈవెంట్ అయినా ..ఏ పబ్బైన ..ఏ డీజే అయినా ఈ పాట మారుమ్రోగిపోతుంది.

కాగ సినిమా థియేటర్స్ లో కూడా ఈ పాట వస్తే జనాలు ఎవ్వరూ సీట్లలో కూర్చోవడం లేదు . అరుపులు – కేకలు – విజిల్స్ తో హోరెత్తించేస్తున్నారు . కాగా గుంటూరు కారం సినిమాలోని ఈ పాటలో పూర్ణ మనకి స్పెషల్ అపీరియన్స్ లో కనిపిస్తుంది . నిజానికి త్రివిక్రమ్ ఈ రోల్ కోసం కాజల్ అగర్వాల్ ను చూస్ చేసుకున్నారట . కానీ ఆమె మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా చేసి మళ్లీ ఆయన సినిమాలో ఇలాంటి పాత్ర చేయడానికి మనసు అంగీకరించలేదట.

అందుకే ఈ రోల్ ని రిజెక్ట్ చేసిందట . అలా కాజల్ గుంటూరు కారం సినిమాను మిస్ చేసుకుంది.గుంటూరు కారం సినిమాతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తున్నాడు సూపర్ స్టార్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమాలో హీరోయిన్ గా శ్రీలీల సందడి చేసింది. ఈ సినిమాలో మొదట గా పూజా హెగ్డే ను అనుకున్నారట మేకర్స్. కానీ ఆమె ను కొన్ని కారణాల చేత సినిమా నుండి తీసేశారు..!!