అప్పటికే పూర్తికానున్న బన్నీ ” పుష్ప 2 ” షూటింగ్.. ఆ తర్వాత నుంచి బాక్స్ ఆఫీస్ లు బద్దలు అవ్వాల్సిందే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బన్నీ తాజాగా హీరోగా నటిస్తున్న సినిమా ” పుష్ప 2 “. ఈ సినిమాపై అల్లు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. లేటెస్ట్ టాలీవుడ్ బజ్‌ ప్రకారం ఈ సినిమా యొక్క షూట్ మొత్తం మే నెల కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించి టీం ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెడతారట. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీత మందిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్ లో ప్రేక్షకులు ముందుకి రానుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.