రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న ఎన్టీఆర్.. ఆ విషయంలో ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడా..!!

ఇప్పటికి టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోస్ కొన్నిసార్లు కథలను వదులుకోవడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ఇలా వదులుకున్న సినిమాలు తర్వాత మంచి సక్సెస్ సాధిస్తే ఎందుకు ఈ సినిమాను వదులుకున్నామని ఆ స్టార్ హీరోస్ బాధపడే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఓ సినిమాను వదులుకున్న విషయంలో ఎన్టీఆర్ కూడా ఎంతో ఫీలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ గతంలో రవితేజ నటించి బ్లాక్ బ‌స్టర్ కొట్టిన ఓ సినిమాలు మిస్ చేసుకున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి అసలు ఎందుకు దానిని వదులుకోవాల్సి వచ్చిందో ఒకసారి చూద్దాం.

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఏవో కారణాలతో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. అయితే బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమైన మొదటి సినిమా భద్ర. ఈ సినిమా కథ‌ని మొదటగా ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని బోయ‌పాటి భావించాడట. అయితే ఎన్టీఆర్‌కు ఈ కథ‌ని బోయపాటి వినిపించగా.. ఇండస్ట్రీకి అతను కొత్త, కథ చెప్పే విషయంలో కూడా తడబడుతున్నారు.. కొత్త డైరెక్టర్ తో ఈ తరహా సినిమాలో తీయడం రిస్క్ అవుతుందేమోనని సందేహంతో ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి ఇష్టపడలేదట.

దీంతో చేసేదేమీ లేక బోయపాటి ఈ సినిమా కాదని మాస్ మహారాజ్ రవితేజ వద్దకు తీసుకు వెళ్ళాడు. ఈ సినిమాను ఆయన ఓకే చేయడంతో రవితేజ హీరోగా పెట్టి భద్ర సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో మీరాజాస్మిన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయి సక్సెస్ సాధించిన తర్వాత అనవసరంగా ఈ సినిమాను వదులుకున్నానే అని ఎన్టీఆర్ ఎన్నో సందర్భాల్లో బాధపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ గతంలో జరిగిన ఇంటర్వ్యూలో వివరించాడు.