ప్రభాస్ చేత మహేష్ బలవంతంగా చేయించిన మూవీ ఇదే.. భలే ఇరికించేసాడుగా..!

ఎస్ .. ఆ సూపర్ హిట్ సినిమాను మహేష్ బాబు చెప్తేనే ప్రభాస్ చేశాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . ఈ విషయం మన అందరికీ తెలిసిందే ..అలా ఎంతోమంది హీరోలు సినిమాలను ఇచ్చిపుచ్చుకున్నారు . అయితే మన వద్ద వచ్చిన కథను మనం రిజెక్ట్ చేసిన సరే మరో హీరో అయితే బాగుంటాడు అని చెప్పుకున్న స్టార్ హీరోస్ చాలా తక్కువగా ఉంటారు.

ఆ లిస్టులోకే వస్తాడు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు. మహేష్ బాబు తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కు తనకు చెప్పిన ఆ కథ నచ్చకపోతే వేరే ఏ హీరోకి బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తారట అలా తన వద్దకు వచ్చిన డార్లింగ్ సినిమా కథను రిజెక్ట్ చేసిన మహేష్ బాబు డైరెక్టర్ కు ప్రభాస్ అయితే ఈ సినిమాకి బాగుంటాడు అంటూ సజెస్ట్ చేశారట . అంతేకాదు ప్రభాస్ కి స్పాట్లోనే ఫోన్ చేసి మరి ఈ సినిమాను నువ్వు చేయాలి డార్లింగ్ అంటూ ఫిక్స్ అయిపోయేలా చేసాడట .

అంతేకాదు డార్లింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ కొట్టాక ప్రభాస్ మహేష్ బాబు ఇంటికి వచ్చి స్పెషల్గా థాంక్స్ చెప్పారట. డార్లింగ్ సినిమా హిట్ అవ్వడం ప్రభాస్ కెరియర్ కు ఎంతో ప్లస్ అయింది . అలా ప్రభాస్ చేత ఈ సినిమా చేయించి ఆయన ఖాతాలో సూపర్ డూపర్ హిట్ వేశాడు మహేష్. ప్రజెంట్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. ప్రభాస్ సలార్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు..!!