” జెర్సీ తరువాత అందుకే తెలుగు సినిమాలు చేయలేదు “.. శ్రద్ధా శ్రీనాథ్ సెన్సేషనల్ కామెంట్స్…!

కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాని హీరోగా నటించిన ” జెర్సీ ” సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఇక జెర్సీ అనంతరం ఈ ముద్దుగుమ్మ ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెంకీ ” సైంధవ్ ” మూవీలో ఓ కీల‌క‌ పాత్ర పోషిస్తుంది.

ఇక సినిమా ప్రమోషన్స్ సమయంలో శ్రద్ధ ను ఎందుకు ఎక్కువ టాలీవుడ్ సినిమాలు చేయడం లేదని ప్రశ్నించగా.. ఈమె కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” నాకు స్ట్రిప్టు నచ్చకపోతే చెయ్యను. నా స్టాండర్స్ చాలా ఎక్కువ. జెర్సీ తర్వాత నేనేదైనా చేస్తున్నానంటే అది జెర్సీతో సమానమైన సినిమా అయ్యే ఉండాలి లేదా అంతకంటే మంచి సినిమా కావాలి. జెర్సీ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి.

కొంత స్థాయిలో నేను మూస పద్ధతిలో ఉన్నాను. తల్లిగా నటించడం నాకు సమ్మతమే. అది కేవలం తల్లి పాత్ర అయితేనే.. నేను ఎంచుకోవడానికి చాలా సినీ పరిశ్రమలు ఉన్నాయి. నాకు ఎల్లప్పుడూ పని ఉంటుంది. కానీ నేను ఎప్పుడూ అలాంటి వ్యక్తిని కాదు. ఇది 2024 మరియు భారతదేశం నుంచి కొన్ని అద్భుతమైన సినిమాలను మనం చూస్తాము. ఇప్పుడు మన‌ స్థాయిని పెంచుకోవడానికి ఇదే సమయం ” అంటూ చెప్పుకొచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.