రెండు రోజులు నిద్ర పోనివ్వకుండా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని భయపెట్టిన ఏకైక నటుడు ఇతడే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది తోపైన హీరోలు ఉన్నా సరే ఈయన పేరు చెప్తే వచ్చే క్రేజ్ అరుపులు మామూలుగా ఉండవు . అది అందరికీ తెలిసిందే . ఏదో పవన్ కళ్యాణ్ ని తిట్టాలి అని తిడితేనే మన పేరు వైరల్ అవుతుందని ..తెలిసి కొంతమంది ఆయనను తిడుతున్నారే తప్పిస్తే .. అలా తిట్టడం వాళ్లు మనస్పూర్తిగా చేయడం లేదన్న విషయం వాళ్లకి తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక్కసారి అయినా సరే దగ్గర నుంచి చూడాలి అని ..అనుకోని అభిమాని ఉండడు.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో తన కెరియర్ లో ఎన్నో సినిమాలో నటించాడు . ఎన్నో సినిమాలు కూడా చూశాడు . కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని భయపెట్టిన ఏకైక నటుడు మాత్రం రవితేజ అని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో ఆయన పర్ఫామెన్స్ చూసి పవన్ కళ్యాణ్ సైతం షాక్ అయిపోయాడట .

నిజానికి ఈ సినిమా మొదటగా పవన్ కళ్యాణ్ కోసమే రాసుకున్నారు . కానీ పవన్ రిజెక్ట్ చేయడంతో ఆ కథ రవితేజ వద్దకు వెళ్ళింది . అలా రవితేజ ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు . ఈ సినిమా చూశాక రెండు రోజులు పవన్ కళ్యాణ్ నిద్రపోలేదట . రవితేజ పర్ఫామెన్స్ నర నరాల్లోకి ఎక్కేసిందట . విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర అంతలా ఆయనను భయపెట్టిందట..ప్రజెంట్ ఇదే న్యూస్ తెగ ట్రెండింగ్ అవుతుంది..!!