కొడుకు సినిమా కోసం అలా చేస్తూ అడ్డంగా బుక్కైన సుమ.. ట్రోల్స్ చేస్తున్న నేటిజన్స్..

తెలుగు బుల్లితెర‌పై ప్రసారమవుతున్న ప్రముఖ డ్యాన్స్ షోలలో ఢీ కూడా ఒకటి. ఎప్పటినుంచో సీజన్ల వారీగా రన్ అవుతూ విజయవంతంగా సాగుతున్న ఈ షో ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రన్ అవుతున్న ఈ షోలో బుల్లితెరపై నటించి మెప్పించిన చాలామంది నటీనటులను, డాన్సర్లుగా పరిచయం చేస్తూ షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలో ఉంటే తాజాగా ఢీ సెలబ్రిటీ ఎపిసోడ్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్‌కు యాంకర్ సుమ గెస్ట్ గా హాజరైంది.

సుమా కొడుకు రోషన్ కనకాల‌ హీరోగా నటించిన బబుల్‌గ‌మ్‌ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిక్స్డ్‌ టాక్ వచ్చింది. ఇక మూవీ ప్రమోషన్స్ కోసం సుమా, రోషన్ హీరోయిన్ మానస ఢీ షోకి వచ్చి సందడి చేశారు. శ్వేత నాయుడు అనే కంటిస్టెంట్ మ్యాడ్ మూవీలో పడితే లైన్ లో పడతది అనే సాంగ్ కి అదిరిపోయే పర్ఫామెన్స్ చేసి అందులో భాగంగా నోట్లో నీళ్లు పోసుకుని మళ్లీ ఉమ్మేస్తూ చేసిన డాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఆమె డ్యాన్స్ పై సుమా ఫన్నీగా స్పందించింది. నేను చెప్పిన మూమెంట్ ఏంటి.. నువ్వు చేస్తున్నదేంటి అని మాట్లాడింది. దీంతో హైపర్ ఆది మధ్యలో కలగజేసుకొని ఇప్పుడు సుమా గారు ఆస్టెప్పులు వేసి చూపిస్తారు అన్నాడు.

దీంతో సుమ డ్యాన్స్ చేస్తూ నోట్లో నీళ్లు పోసుకుని ఊస్తూ ఉండగా.. ఆ నీటిని హైపర్ ఆది బకెట్ తో పట్టుకోవాలని చూస్తాడు. కానీ ఒకసారి సుమా ఏకంగా హైపర్ ఆది ముఖం మీద డైరెక్ట్ గా ఉమ్మ‌డం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వాళ్లు ఫన్నీగా ఈ ఇన్సిడెంట్ చేసినప్పటికీ.. చూసేవారికి అది ఇబ్బందిగా అనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో కొడుకు ప్రమోషన్స్ కు వచ్చిన దానివి ప్రమోషన్స్ లో భాగంగా మరీ ఇంతకు దిగజారాలా.. ఇలాంటి పనులు చేస్తున్నవ్‌ ఏంటి సుమా.. నీపై గౌర‌వాని నువ్వే పొగొట్టుకుంటున్నావ్‌ అంటూ సుమాపై ఫైర్ అవుతున్నారు.