పవన్ కళ్యాణ్ వదులుకున్న ఆ టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ.. టైటిల్ ఏంటంటే.?

ఒక సినిమా కోసం ముందుగా అనుకున్న టైటిల్‌ను మరో సినిమాకు కన్ఫర్మ్ చేయడం అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో సాధారణంగా జరుగుతూనే ఉంది. ‘ అర్జున్ ‘ అనే టైటిల్ అల్లు అర్జున్ కోసం మొదట అల్లు అరవింద్ రిజిస్టర్ చేసుకున్నారు. కానీ అది మహేష్ బాబు సినిమా యూనిట్ రిక్వెస్ట్ చేయడంతో ఆ మహేష్ కి ఇవ్వడానికి అల్లు అరవింద్ అంగీకరించారు. అలాగే ‘ మిస్టర్ పర్ఫెక్ట్ ‘ టైటిల్ మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ అయిన తరువాత ప్రభాస్ – దిల్ రాజుల సినిమా కోసం ఇచ్చేశారు.

‘ మిర్చి ‘ టైటిల్ కూడా మహేష్ బాబు సినిమా కోసం రిజిస్టర్ చేయించుకొని ప్రభాస్ – కొరటాల కాంబో సినిమా కోసం రిక్వెస్ట్ చేయగా ఇచ్చేశారు. ‘ దేవర ‘ టైటిల్.. పవన్ కళ్యాణ్ సినిమా కోసం వండ్ల‌ గణేష్ రిజిస్టర్ చేయించారు. కానీ ఎన్టీఆర్ – కొరటాల సినిమా కోసం ఇది తీసుకున్నారు. అయితే వీటికి కాస్త డిఫరెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అనుకున్న టైటిల్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తీసుకున్నారంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబోలో ‘ బ్రో ‘ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ముందుగా చాలా టైటిల్స్ అనుకున్నారట.

అందులో ” దేవుడే దిగివచ్చిన ” అనే టైటిల్ కూడా ఒకటి. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడు కాదు. అందుకే టీం ఆ టైటిల్ ని ఫిక్స్ చేయలేదట. అయితే ఇప్పుడు ఆ టైటిల్ ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోసం అనుకుంటున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫ్రేమ్ మున్నా డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ సుంకర ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు దేవుడే దిగివచ్చిన టైటిల్ బాగా సూట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. నాగార్జున ‘ సంతోషం ‘ మూవీ సూపర్ హిట్ సాంగ్ లోని ఓ లైన్ ఆధారంగా ఈ టైటిల్ని తీసుకున్నారు.