“పుష్ప 2” లో సుకుమార్ కి అసిస్టెంట్ గా ఆ స్టార్ యాంకర్.. ఇక “మనల్ని ఎవ్వడ్రా ఆపేది”..!!

పుష్ప..పుష్ప రాజ్ ..నీ అవ్వ తగ్గేదేలే . ఈ డైలాగు ఎన్ని సార్లు చెప్పిన బోర్ కొట్టదు.. ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరదు .. ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది .. అలాంటి ఓ పవర్ఫుల్ డైలాగ్ ను మనకు అందించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ గా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ తెరకెక్కించిన సినిమానే పుష్ప దీ రైజ్. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రికార్డును బద్దలు కొట్టిందో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు .

బన్నీ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్తమ జాతియ నటుడి అవార్డు సైతం వచ్చేలా చేసింది. ప్రజెంట్ పుష్ప 2 సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్.. భారీ అంచనాలు కూడా ఉన్నాయి . కాగా ఈ సినిమాలో టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి కూడా భాగం కానున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పుష్ప 2 సినిమాలో న్యూస్ రీడర్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. అందుకే న్యూస్ కి సంబంధించిన కొన్ని విషయాలను ..కొన్ని అలవాట్లను దగ్గర నుండి తెలుసుకోవడానికి..

ఈ సినిమా కోసం దేవీ నాగవల్లిని హెల్ప్ చేయమంటూ సుకుమార్ రిక్వెస్ట్ చేశారట . దేవి నాగవల్లి కూడా అందుకు ఓకే చేసిందట . అలా ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా మారిపోయింది దేవీ నాగవల్లి అంటున్నారు అభిమానులు .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా తో బన్నీ- సుకుమార్ గ్లోబల్ రికార్డ్స్ బీట్ చేయడం పక్కా అంటున్నారు జనాలు. అంతెకాదు ఈ సినిమాతో మరో ఆస్కార్ ఇండియాకి రాబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!