మహేష్ ” గుంటూరు కారం ” థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్… ఎప్పుడంటే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్గా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్, పోస్టర్స్, ఫస్ట్ లుక్, మాస్ స్ట్రైక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ స్పేసెస్ లో థియేటర్స్ ఇష్యూస్ లో భాగంగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ..” గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ ని జనవరి 6న విడుదల చేస్తున్నాము.

మా సినిమాపై మీ అందరికీ ఎంతో నమ్మకం ఉంది. అలాగే జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం మూవీకి అవకాశం ఉన్న మేరకు థియేటర్స్ ఏర్పాటు అయ్యేలా చూస్తాము ” అంటూ చెప్పుకొచ్చాడు నాగ వంశి. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.