రికార్డ్ స్థాయిలో ‘ సైంధవ్ ‘ మూవీ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..?

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో ఏ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో అనే ఆసక్తి ప్రేక్షకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సినిమా కూడా డిఫరెంట్ స్టైల్‌లో ప్రత్యేకమైన బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఎంత హైప్‌ క్రియేట్ చేసినా కూడా.. తప్పకుండా మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తేనే సినిమా బాక్సాఫీస్ వద్ద లాభాలు బాట పట్టే అవకాశం ఉంటుంది. ఈ పోటీలో జ‌నాని విభిన్నంగా ఆకట్టుకునేందుకు సైంధవ్‌ సినిమా కూడా రెడీ అయింది. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.

ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బిజినెస్ ఎలా ఉందో.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు తెచ్చి పెట్టాలో ఒకసారి చూద్దాం. సైంధవ్‌ మూవీ థియేట్రిక‌ల్‌ బిజినెస్ నైజాం ఏరియాలో రూ.7 కోట్లు ధర పలికినట్లు తెలుస్తుంది. ఆంధ్రలో రూ.9 కోట్లు, తెలంగాణ.. ఆంధ్ర ప్రదేశ్ లో టోటల్గా 19 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వివరిస్తున్నాయి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే దాదాపు రూ.2 కోట్ల దరపలికినట్లు సమాచారం. ఇక ఓవర్సిస్ లో రూ.4 కోట్ల బిజినెస్ జరిగిందట. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.25 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు లాభాలు రావాలంటే ఖచ్చితంగా రూ.26 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు క్రియేట్ అవుతున్న బజ్‌ చూస్తుంటే.. ఈ టార్గెట్ అందుకోవడం చాలా శులభం అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ శైలేష్ కొలను ఇదివరకే తన హిట్ సినిమాలతో మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక వెంకి నటిస్తున్న సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటేష్ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. కాబట్టి సంక్రాంతికి సైంధ‌వ్‌ కూడా మిగతా సినిమాలకు గట్టి పోటీగానే ఉండబోతుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ అందుకుంటుంది. ఏ రేంజ్ లో సక్సెస్ ద‌క్కించుకుంటుందో చూడాలి.