శ్రీలీలతో అంత ఈజీ కాదు.. స్టార్ హీరోల కైనా తాట ఊడిపోవాల్సిందే.. మహేష్ బాబు ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమాలో మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. సంక్రాంతి బరిలో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. ఇందులో భాగంగా గుంటూరు కారం సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు.. శ్రీ లీల గురించి మాట్లాడుతూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా మహేష్ బాబు ఏ సినిమా వేడుకల్లో కూడా ఆ సినిమా హీరోయిన్లను గురించి పెద్దగా మాట్లాడాడు అంటూ టాక్ వినిపించేది. అయితే ఈసారి మాత్రం గుంటూరు కారం లో నటించిన శ్రీలీల గురించి హైలెట్ చేస్తూ మాట్లాడాడు మ‌హేష్‌. మూవీ మేకర్స్ గురించి, డైరెక్టర్ గురించి మాట్లాడిన తర్వాత శ్రీ‌లీల‌ వైపు చూస్తూ నువ్వే కంగారు పడకు.. నేను మర్చిపోలేదు అంటూ ఆమె గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇన్ని రోజుల తర్వాత ఓ తెలుగమ్మాయి చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుందంటే చాలా హ్యాపీగా ఫీలయ్యా అంటూ వివరించాడు.

మా టీం ఒక మంచి హీరోయిన్ ని సెలెక్ట్ చేశారు అంటూ వివరించాడు. శ్రీ లీల చాలా హార్డ్ వర్క్ చేసే అమ్మాయని.. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా క్యారవాన్ లోకి వెళ్లకుండా అక్కడే ఉండి అందరిని సపోర్ట్ చేస్తూ ఉంటుందని వివరించాడు. ఇక శ్రీలీల డాన్స్ గురించి మహేష్ మాట్లాడుతూ.. ఈ అమ్మాయి తో డ్యాన్స్ చేయడం అంత ఈజీ కాదు.. అదేం డ్యాన్స్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. తనతో డ్యాన్స్ చేయాలంటే హీరోలకి తాట ఓడిపోతుంది అంటూ శ్రీ లీల ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ గురించి మహేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.