అలాంటి పని చేసిన త‌మ‌న్న‌.. షాక్ లో ఫ్యాన్స్‌.. డ‌బ్బులు ఇస్తే దేనికైనా రెడ్డినా అంటూ..

తెలుగు స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ బాలీవుడ్ లో వరుస‌ ఆఫర్లను అందుకుంటుంది. ఈ ముద్దుగుమ్మకు ప్రముఖ కంపెనీల నుంచి ప్రమోషన్స్ చేయడానికి భారీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. నటులు ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత ఎక్కువ డబ్బు చెల్లించి మరి తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవాలని కంపెనీ యాజమాన్యాలు భావిస్తాయని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మన స్టార్స్ కొన్ని పనికి వచ్చే యాడ్స్ చేస్తే.. మరి కొన్ని సమాజ హితమైన యాడ్లలో కూడా కనిపిస్తున్నారు.

దానికి తగ్గట్లుగానే డబ్బులు కూడా అందుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ లిస్టులోకి స్టార్ హీరోయిన్ తమన్న కూడా యాడ్ అయిపోయింది. బ్యాన్ చేసిన ఓ గ్యాంబ్లింగ్ యాప్ ను తమన్న ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో అది కూడా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తమన్న పోస్ట్ చేయడంతో ఇది చర్చిని అంశంగా మారింది. ఆ వీడియోలో అక్కడ, ఇక్కడ కాదు ఈ వెబ్సైట్లో జూదం ఆడండి అంటూ ప్రేక్షకులకు తమన్నా సజెస్ట్ చేసింది. ఇందులో మీరు జాయిన్ కొన‌గానే 400 బోనస్ వస్తుందంటూ వివరించండి.

ప్రతి 50,000 డిపాజిట్ కి 5% బోనస్ కూడా ఉందని.. అంతేకాక అందులో పదుల సంఖ్యలో గేమ్స్ కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోను చూసిన తమన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి ఇలాంటి బ్యాన్ చేసిన గాంబ్లింగ్ యాప్స్ నువ్వు ప్రమోట్ చేయడం ఏంటి అంటూ.. జనాలను ప్రలోభాలకు గురి చేసే యాడ్లు ఎందుకు తీస్తున్నారు అంటూ.. డబ్బులు ఇస్తే ఎలాంటి పనైనా చేసేస్తారా అంటూ విమర్శిస్తున్నారు. ఇక ప్రస్తుతం తమన్న పై వస్తున్న ఈ నెగటివ్ కామెంట్స్ కు మిల్కీ బ్యూటీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.