ఇంత బ్రతుకు బ్రతికి..చివరికి ఇవేం పనులు రా నాయనా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో నయనతార – విగ్నేష్ శివన్ ను ట్రోల్ చేస్తున్నారు జనాలు . మనకు తెలిసిందే నయనతార – కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. ఆ మాటకి చెప్పాలి అంటే సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీయస్ట్ బ్యూటీ . అయితే ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్న విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సరోగసి ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యింది నయనతార .

రీసెంట్గా విగ్నేష్ శివన్ ఎల్ఐసి అనే టైటిల్ తో ఒక సినిమాను తీయడానికి డిసైడ్ అయ్యారు . అయితే ఈ సినిమా టైటిలే పెద్ద వివాదంగా మారిపోయింది . లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది . తమ సంస్థకు మంచి పేరు ఉంది అని.. ఆ పేరును చెడగొట్టే విధంగా మీ సినిమాలు తెరకెక్కిస్తే ఒప్పుకోమంటూ లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ నోటీసులు కూడా పంపింది . ఏడు రోజులోపు మూవీ టైటిల్ మార్చాలని ..

లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది . ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ కి కూడా ఎల్ఐసి సంస్థ నోటీసులు పంపడం గమనార్హం . అయితే ఇప్పటివరకు దీనిపై సినిమా యూనిట్ కాని విగ్నేశ్ కానీ స్పందించలేదు . అయితే కొంతమంది నయనతార ఫ్యాన్స్ మాత్రమే ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అసలు వీళ్ళకి ఏమైంది..? ఎందుకు వీళ్ళు తెలిసి తెలిసి ఇలాంటి తప్పు చేస్తున్నారు..?? ఎల్ఐసి అనే పేరు పెట్టడం ప్రాబ్లం వస్తుందని తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి ..??? అన్ని కోట్ల ఆస్తి ఉండి ప్రేమగా బ్రతికే స్టేటస్ ఉండి ఇలా చీప్ గా ట్రోల్ చేయించుకోవడం ఎంతవరకు న్యాయం అంటూ విగ్నేష్ నయన్ లను ఏకిపారేస్తున్నారు..!!