సోషల్ మీడియాలో రామ్ చరణ్ మాస్ క్రేజ్ చూస్తే అవాక్ అవుతారు..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం చరణ్ ” గేమ్ చేంజర్ ” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక చరణ్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అంతటి ఫాలోయింగ్ ఉంటుంది చరణ్ కి. ఆర్ఆర్ఆర్ సినిమాతో నేషనల్ సహా ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా రామ్ చరణ్ కి మంచి ఫాలోయింగ్ రాగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో అయితే తన ఫాలోయింగ్ మామూలు లెవెల్ లో లేదని చెప్పొచ్చు.

ఇక లేటెస్ట్ గా ఆ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో రామ్ చరణ్ ఏకంగా 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని క్రాస్ చేశాడు. తన టాలీవుడ్ సహా సౌత్ నుంచి కూడా ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ హీరోగా చరణ్ నిలిచాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త తెలుసుకున్న చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.