వాట్..ఈ హీరోయిన్ కి మన విరాట్ కోహ్లీ బావ అవుతాడా..? సీక్రేట్ లీక్ చేసి సిగ్గుపడిపోయిందిగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రుహాని శర్మ .. విరాట్ కోహ్లీ కు మరదలు అవుతుందా ..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రుహానీ శర్మ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన పనిలేదు . ఓ తమిళ సినిమాతో సినీ పరిశ్రమంలోకి వచ్చి ఆ తర్వాత తెలుగులో చి ల సౌ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడమే కాకుండా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది .

ఆ తర్వాత పలు భాషలలో సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేదు. ప్రజెంట్ మన వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. సంక్రాంతి కానుకగా వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా జనవరి 13వ తేదీ థియేటర్స్ లోకి రాబోతుంది . ఈ క్రమంలోనే సినిమాలో రుహాని శర్మ డాక్టర్ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది . రీసెంట్గా షాప్ ఓపెనింగ్ కి వచ్చిన రుహాని శర్మ తన మనసులోని మాటలను అభిమానులతో షేర్ చేసుకుంది.

అంతేకాదు ఈ క్రమంలోనే మీడియా వాళ్ళు ఆమెను అడిగిన ప్రశ్నలకు షాక్ అయిపోయింది .”మీరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు సిస్టర్ అవుతారట..? విరాట్ కోహ్లీకి మరదలు అవుతారట..? అని అడగ్గానే..” మీకు ఎలా తెలుసు..? ఇది చాలా చాలా సీక్రెట్ ..ఇప్పటివరకు నేను ఎవరికీ చెప్పలేదు” అంటూ ఆశ్చర్యపోయింది . అంతేకాదు నిజమే.. అనుష్క నాకు సిస్టర్ అవుతుంది విరాట్ నాకు బావ అవుతాడు ..చాలా చాలా మంచోడు నాతో బాగా మాట్లాడుతాడు . వాళ్ళిద్దరూ కూడా చాలా మంచి మనుషులు ..ఎలాంటి ఫిల్టర్స్ ఉండవు ” అంటూ విరాట్ అనుష్కలను ఓ రేంజ్ లో పొగిడేసింది..!!