రిలీజ్‌కు ముందే తెలుగు రాష్ట్రాల్లో అలాంటి రికార్డ్‌ క్రియేట్ చేసిన హనుమాన్. గంటల్లోనే 108 అవుట్..

తెలుగు సినీ పరిశ్రమల్లో విభిన్నమైన సినిమాలను చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ!, కల్కి, జాంబిరెడ్డి లాంటి ప్రయోగాత్మక సినిమాలను తెరకెక్కించి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాను తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. రియల్ సూపర్ మ్యాన్ హనుమంతుడి కథతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్‌కి ముందే మంచి బజ్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రేర్ రికార్డును సాధించింది.

ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అమృత అయ్య‌ర్ హీరోయిన్గా తెరకెక్కిన మూవీ హనుమాన్. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. కే నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమాకి అనుదీప్ దేవ్, హరి గౌడ్, జై కృష్ణ, కృష్ణ సాయిరామ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా సందడి చేయ‌టానికి విభిన్నమైన కాన్సెప్ట్ తో, భారీ గ్రాఫిక్స్ తో సూపర్ మ్యాన్ స్టోరీగా వ‌స్తున్న‌ ఈ సినిమాపై రిలీజ్ కి ముందే మంచి హైప్ ఏర్పడింది.

ఇందులో భాగంగానే 11వ తేదీ నుంచి యుఎస్ లో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు 108 ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి అనుమతిని ఇచ్చారు. అందులో హైదరాబాదులో 37, వైజాగ్ లో 27, గుంటూరులో 10, నెల్లూరులో 08, రాజమండ్రిలో 04.. మొత్తం 108షో లకు ప్లాన్ చేశారు. అయితే టికెట్స్ ఓపెన్ చేసిన గంటల్లోనే రికార్డ్ నమోదు చేశాయి. హనుమాన్ మూవీ కి సంబంధించిన 108 ప్రీమియర్ షోల టికెట్ బుకింగ్ ఆన్లైన్‌లో పెట్టగా వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. అతి కొద్ది గంటల్లోనే అన్నిషోలకు సోల్డ్ అవుట్‌ బోర్డులు పడిపోయాయి. ఇలాంటి రికార్డ్‌ కేవలం హనుమాన్ సినిమాకు మాత్రమే సొంతమైంది.