సినీ ఇండస్ట్రీకి మరో నేషనల్ క్రష్ దొరికేసిందిరోయ్ మావ.. రష్మికని మించిపోయే ఫిగర్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ అనగానే అందరికీ గుర్తొచ్చేది రష్మిక మందన్నా. కిర్రాక్ పార్టీ ద్వారా కన్నడ ఇండస్ట్రీని ..ఛలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీని మడత పెట్టేసింది . ఎలా అంటే పుష్ప సినిమా తర్వాత ఏ ఇండస్ట్రీలో పట్టిన ఆమె పేరు ఓ వైరస్ లా పాకి పోతుంది . చిన్న పాప దగ్గర నుంచి పండు ముసలావిడ వరకు ఎవ్వరు అడిగిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నే మా ఫేవరెట్ హీరోయిన్ అంటున్నారు .

అలాంటి స్టార్ స్టేటస్ అందుకుంది . కాగా ఇప్పుడు ఆ నేషనల్ స్టేటస్ ను మరో హీరోయిన్ అందుకునింది . ఆమె మరెవరో కాదు మేధా శంకర్ . సోషల్ మీడియాలో మేధా శంకర్ పేరు ఇప్పుడు భారీ స్థాయిలో వైరల్ గా మారింది .ఒక్క సినిమాతోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది . ఇంతకీ ఈ మేధాశంకర్ ఎవరు అని అనుకుంటున్నారా..? ట్వెల్త్ ఫెయిల్ సినిమాలోని హీరోయిన్ . చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి థియేటర్లో రచ్చ రంబోలా చేస్తుంది.

ఈ మూవీ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచ సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఈ చిత్రానికి అత్యధిక రేటింగ్ కూడా ఇచ్చింది . ఈ సినిమాలో మేధా శంకర్ హీరోయిన్గా నటించిన మంచి గుర్తింపు సంపాదించుకుంది . బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న మేధా ..పెద్దగా ఆడియన్స్ కు తెలిసేది కాదు.. కానీ ఒక్క సినిమాతో మాత్రం మేధా శంకర్ బాగా పాపులారిటి దక్కించుకుంది . ఇప్పుడు ఆమె నేషనల్ క్రష్ గా మారిపోయింది..!!