‘ గుంటూరు కారం ‘ కి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మహేష్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టే.. ఇంతకీ అదేంటంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. మహేష్ నుంచి ఏడిదిన్న‌ర త‌ర్వాత ఓ సినిమా రిలీజ్ కావడంతో సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గుంటూరు కారం సినిమాకు ఓ లక్కీ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హిట్ సెంటిమెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు – ప్రకాష్ రాజ్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మహేష్ నటన‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ కాంబో కలిసిన నటిస్తే సినిమా హిట్ అవుతుందని సెంటిమెంట్‌ను ఫ్యాన్స్‌ కూడా గట్టిగా నమ్ముతారు. ఇక మహేష్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మొదటి సినిమా రాజకుమారుడు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రలో నటించాడు.

అదే విధంగా ప్రకాష్ రాజ్ – మహేష్ బాబు కలిసి నటించిన మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బిజినెస్ మ్యాన్, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు ఈ పై సినిమాల లిస్ట్ అంతా వీరిద్దరి కాంబోలోనే వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక స్పైడర్, బ్రహ్మోత్సవం, నాని, అతిధి, వన్ నేనొక్కడినే, ఆగడు ఫ్లాప్‌గా మహేష్ కెరీర్ స్టార్టింగ్‌లో నటించిన వంశీ, యువరాజు సినిమాలో యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నాయి. దానికి కారణం ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో నటించక‌ పోవడమే అని ఫ్యాన్స్‌ భావిస్తారు.

ఇక సైనికుడు, ఖలేజా, బాబి, అర్జున్ లాంటి సినిమాలు వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమా మంచి సక్సెస్ రాకపోయినా క్లాసికల్ మూవీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. మహేష్ నటనకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వీరిద్దరి కాంబోలో రాకుండా బ్రహ్మాండమైన హిట్ కొట్టిన మహేష్ ఏకైక సినిమా శ్రీమంతుడు. ఈ లెక్కన చూసుకుంటే మహేష్, ప్రకాష్ రాజు కలిసి నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లుగా నిలిచాయి. ఈసారి కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే గుంటూరు కారం కచ్చితంగా హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమాతో మహేష్ కచ్చితంగా హిట్ కొడతాడు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.