ఫాన్స్ తో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న మెగా కోడలు లావణ్య.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన గుడ్ న్యూస్‌ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తన కుటుంబంలో జరిగిన ఆనందకర సంఘటనని అందరికీ వివరించింది. అలాగే ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఈ విషయం కాస్త నెటిజ‌న్ల మధ్య చర్చకు దారితీసింది. ఇంతకీ హీరోయిన్ లావణ్య ఏం చెప్పింది.. ఏం ఫోటో షేర్ చేసింది.. ఇప్పుడు తెలుసుకుందాం.

From Miss Uttarakhand to Tollywood, all you need to know about Lavanya  Tripathi | The Times of India

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య మీడియం రేంజ్‌ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకుంది. సాధారణ హీరోయిన్ గానే ఉండిపోయినా.. ఈమె న‌ట‌న‌కు మాత్రం ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి. మరోవైపు మిస్టర్ సినిమా చేస్తున్న టైంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలం ప్రేమాయణం తర్వాత 2023 జూన్ లో వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం జరుపుకుంది.

ఈ జంట నవంబర్‌లో వైవాహిక‌ జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక వీరిద్దరి వివాహం తర్వాత లావణ్య ఏం పోస్ట్ చేసిన వెంటనే అభిమానులు దాని హైలెట్ చేస్తూ వస్తున్నారు. అలా తాజాగా తనకు మేనల్లుడు పుట్టాడంటూ ఇన్‌స్టాలో లావణ్య షేర్ చేసుకుంది. సొట్టబుగ్గల జీన్స్‌ తన కుటుంబంలో ఆ పిల్లాడు కొనసాగిస్తున్నాడని.. నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ షేర్ చేసుకుంది. ఆ బాబు ఫోటోలు షేర్ చేసినప్పటికీ.. ముఖం కనిపించకుండా ఇమేజి తో కవర్ చేసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో లావణ్య చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.