” అఖండ 2లో ” నందమూరి మోక్షజ్ఞ ఓ కీలక పాత్ర… సినిమా పక్క బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్..!

నందమూరి మోక్షజ్ఞ రీయంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా సార్లు స్పందించారు. తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్లోకి హీరోగా పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు కూడా.

అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే..” అఖండ 2 ” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ ని పూర్తి చేశాడు.

కాగా ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ కోసం బోయపాటి ఓ స్పెషల్ పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. కాబట్టి అఖండ 2 లో బోయపాటి దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది. ఈ వార్త విన్న నందమూరి అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.