తన ట్యాగ్ మార్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇక తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “.

ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ గ్లింప్స్ నిన్ననే రిలీజ్ కాగా వాటికి రికార్డ్ సృష్టించాయి. ఇక ఈ సినిమాలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ అంశం అంతా నోటీస్ చేస్తున్నారు. ఈ సినిమాతో అయితే ఎన్టీఆర్ తన స్టార్ ట్యాగ్ నీ మార్చుకున్నాడు అనే చెప్పాలి.

తారక్ ఇన్ని రోజులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా పిలవబడగా ఇకనుంచి దేవరా సినిమాతో అయితే ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా పిలుచుకునే పవర్ఫుల్ ట్యాగ్ ” మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ” గా పిలవబడుతున్నాడు. ఇక దీంతో దేవర సినిమాతో ఎన్టీఆర్ యొక్క సరికొత్త ట్యాగ్ తో చేంజ్ అయ్యే రాబోతున్నాడు అనే చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.