తేజ తో ప్రశాంత్ వర్మ ఏకంగా మూడు సినిమాలు తీయడానికి వెనుక కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ హనుమాన్. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఎక్కడ చూసినా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పేర్లే మారుమోగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో హనుమాన్ 3వ‌ సినిమా కావడం విశేషం. ఇక ప్రశాంత్ వర్మ పేరు ఇంతలా మారుమోగడానికి ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రశాంత్ వర్మ.. తేజను హీరోగా పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రశాంత్ వర్మ మొదట అ! సినిమాను దర్శకత్వం వహించడు. ఈ సినిమాకు నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాకు దర్శకత్వం వహించాడు.

Srikakulam Movies | Srikakulam Theaters | Just Tickets in Srikakulam

ఇక 2021 లో జాంబిరెడ్డి సినిమాతో తేజను హీరోగా పరిచయం చేశాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ తేజ తోనే అద్భుతం అనే మరో సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో తేజ సరసన రాజశేఖర్ కుమార్తె హీరోయిన్‌గా నటించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్లో బాగా ఆకట్టుకుంది. ఇక దీంతో హనుమాన్ సినిమాను మరోసారి తేజ తోనే.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. కాగ‌ మొదటి సినిమా నుంచి వీరిద్దరి మధ్యన మంచి స్నేహం కుదిరిందని, తేజ యాక్టింగ్ స్కిల్స్ కూడా ప్ర‌శాంత్‌కు బాగా న‌చ్చ‌టంతో మిగతా రెండు సినిమాలు కూడా ప్రశాంత్ వర్మ.. తేజనే సెలెక్ట్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇక‌ ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది.

Adbhutham Sneak Peek | Teja Sajja | Shivani Rajasekhar | Mallik Ram |  Prasanth Varma - YouTube

దీంతో ఇంత చిన్న హీరోతో.. అంత‌ పెద్ద సినిమా ఎలా ప్లాన్ చేశాడంటూ ప్రశాంత్ వర్మాని అందరూ ప్రశ్నిస్తూ వచ్చారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎంతో అద్భుతంగా చూపించాడు ప్రశాంత్ వ‌ర్మ. కాగా ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి పోటీగా ఈ సినిమా నిలబడడంతో ప్రేక్షకుల్లో మరింత చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ప్రశాంత్ వర్మ, తేజ సినిమాలకు థియేటర్స్ కూడా తక్కువగానే ఇస్తున్నారు. అయితే ప్రశాంత్ మాత్రం తన సినిమాపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను మహేష్ బాబుకు పోటీగా దించడానికి ఫిక్స్ అయిపోయారు. సంక్రాంతి బరిలో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షక ముందుకు రానుంది.

Hanu Man - Wikipedia