ఆ సినిమాకు ఆస్కార్ ఏమాత్రం ప‌నికిరాదు.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకున్న కీరవాణి.. ఇటీవల నాగార్జున ‘ నా సామిరంగ ‘ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో హాజరయ్యాడు. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్న కీరవాణి మీరు చాలా సెలెక్టివ్ గా సినిమాలో చేస్తుంటారు.. ఇలాంటి టైంలో నా సామిరంగా ఒక సర్ప్రైజ్ ప్యాకేజీల వస్తుంది కదా.. ఆస్కార్ తో వచ్చిన హైప్‌.. నా సామి రంగ పై ఎలాంటి ప్రభావం చూస‌నుంది అంటూ కీరవాణిని ఇంటర్వ్యూవ‌ర్ సూటిగా ప్రశ్నించాడు.

Naa Saami Ranga 1st Song Lyrical Video | Nagarjuna ,Ashika Ranganadh | Mm  Keeravani,Naa Saami Ranga - YouTube

దీనికి ఆయన సమాధానం చెప్తు ఆస్కార్ అవార్డు అనేది సినిమా సక్సెస్ కు పనికిరాదు. నేను మొదటి నుంచి సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తున్న.. దాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ఒక సినిమాకి హైప్ అనేది రిలీజ్ అయ్యే పాటల ద్వారానే వస్తుంది. ఆస్కార్ అనేది ఒక సినిమా సక్సెస్ కి కొంచెం కూడా సంబంధం లేని ట్యాగ్ అని నేను భావిస్తా. నా వరకు నేను బాగా వర్క్ చేయాలి, డైరెక్టర్ బాగా తీయాలి, అలా జనాలకు అది కనెక్ట్ అవ్వాలి అంటూ చెప్పుకొచ్చాడు.

MM Keeravani : 'ఆస్కార్' వచ్చిన తర్వాత కీరవాణి మొదటి సినిమా ప్రమోషనల్  ఇంటర్వ్యూ.. 'నా సామిరంగ' ప్రమోషన్స్ లో.. | Mm keeravani exclusive interview  on nagarjuna naa saam ranga ...

అంతేతప్ప నాకు ఆస్కార్ వచ్చిందని సినిమా ఆడదు. హీరో నాగార్జునతో పని చేయడం నాకు బాగా అలవాటయినా విద్య. మా కాంబినేషన్‌లో చేసిన ప్రతి సినిమా ఇప్పటివరకు సక్సెస్ సాధించింది.’  నా సామిరంగ ‘ కూడా హిట్ అవుతుందని భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నాగార్జున.. ‘ నా సామిరంగ ‘ మూవీ సంక్రాంతి బరిలో జనవరి 14న రిలీజ్ కానుంది.