పండగ పీడ: సంక్రాంతి లోపు ఒక్క కొడుకు ఉన్న ఆడవాళ్లు ఇలా చేయాల్సిందే.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న పండితుల మాటలు..!!

ఈ మధ్యకాలంలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. రాబోయే సంక్రాంతి లోపు ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు అంతకంటే ఎక్కువ కొడుకులు ఉన్న వాళ్ళ చేత డబ్బులు తీసుకొని ఐదు రకాల రంగు గాజులను కొనుకుని చేతికి వేసుకోవాలని .. లేకపోతే అరిష్టం జరుగుతుందని.. అది తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు అంటూ సరికొత్త న్యూస్ ప్రచారం జరుగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఈ న్యూస్ వ్యాపించేసింది .

దీంతో ఇరుగుపొరుగు వారు తెలిసినవారు ఒకరి నుంచి ఒకరికి వార్త బాగా స్ప్రెడ్ అయిపోయింది. దీంతో సంక్రాంతి లోపు అలా డబ్బులు తీసుకుని గాజులు వేసుకోవాలి అంటూ ఆడవాళ్లు పక్కన ఉండే ఆడవాళ్ళ చేత ఇద్దరు కొడుకులు ఉండే తల్లుల చేత డబ్బులు తీసుకుని మరి ఒక కొడుకు ఉన్న తల్లి ఐదు రంగుల గాజులను రెండు చేతులకి వేసుకుంటున్నారు. అయితే పలువురు పండితులు మాత్రం దీన్ని కొట్టి పడేస్తున్నారు .

అలాంటిది ఏం లేదు అని అసలు ఆ వార్త ఎవరు స్ప్రెడ్ చేశారో తెలియదు అని చెప్పుకొస్తున్నారు . మరి కొందరు మాత్రం అలా వేసుకోవడం మంచిదే అని..గాజులు ఆడవాళ్ల సౌభాగ్యం కి గుర్తు అని..ఓ పుణ్య స్త్రీ మరో పుణ్య స్త్రీకి మట్టి గాజులు ఇవ్వడం చాలా శుభ ప్రదం అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు వచ్చే సంక్రాంతి చాలా చెడ్డది అని.. చాలామందికి విషాదాలను మిగులుస్తుందని పరిహార పూజలు చేసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు . దీనితో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది..!!