ఏంటి.. ఏలకుల పాలకు ఇంత శక్తి ఉందా.. రాత్రి పడుకునే ముందు తాగితే అంత లాభమా..!

సాధారణంగా ఏలకుల పాలును చాలామంది తాగుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వాటిని ఇష్టపడరు. కానీ వాటిలో ఉండే పోషకాల గురించి తెలిస్తే తప్పకుండా వాటిని కావాలని తాగుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏలకులు కలిపిన పాలు తాగడం వల్ల జీర్ణ క్రియ పెరుగుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

అలాగే మౌత్ ఎలర్జీ, కడుపులో ఎలర్జీలు న్యాయం చేయడంలో ఈ యాలకులపాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. పడుకునే ముందు ఏలకుల పాలు తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఏలుకులపాలు తాగి విముక్తి పొందండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి.

పాలు, ఏలకులలో క్యాల్షియం ఉండడం వల్ల ఎముకలను బలపరచడంలో కూడా సహాయపడతాయి. ఏలకులు కలిపిన పాలు తాగితే రాత్రి కంటి నిండా నిద్ర పడుతుంది కూడా. ఏలకులు నరాల మీద ప్రభావంతంగా పనిచేస్తాయి. నరాల బలహీనత ఉన్నవారికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఏలకుల పాలుని కచ్చితంగా రోజు రాత్రి తీసుకోవాల్సిందే.