విక్టరీ వెంకటేష్ పై ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన ఆర్య..!

టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలాను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్నలేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” సైంధవ్ “. ఈనెల 13న విడుదల కానున్న ఈ సినిమాపై వెంకటేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతుందనే గట్టి నమ్మకంతో మేకర్స్ సైతం ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఆర్య కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆర్య వెంకటేష్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్య మాట్లాడుతూ..” సైంధవ్ ఒక యాక్షన్ డ్రామా. సాలిడ్ హిట్ అవుతుంది. వెంకటేష్ దూకుడు నటన ప్రేక్షకులకి ట్రీట్ అవుతుంది ” అంటూ చెప్పుకొచ్చాడు ఆర్య. ఇక ఈయన చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకి రీయంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే ఆర్య కెరీర్ పూర్తిగా మారిపోతుందనే చెప్పొచ్చు.