ఆ వ్యక్తి కోసం మోకాళ్లపై కూర్చున్న బాలయ్య.. ఫుల్ ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నాడు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నాడు బాలయ్య. అయితే బాలయ్య బాబు మాట కరుకే కానీ మనసు చాలా మంచిదని చాలా సందర్భాలలో రుజువు అయింది కూడా.

ఇక తన మనసు వెన్న అని మరోసారి రుజువు చేశాడు బాలయ్య. అసలు మేటర్ ఏమిటంటే.. ప్రస్తుతం బాలయ్య బాబు తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయ‌నను కలిసేందుకు ఓ అభిమాని బాలయ్య కార్యాలయానికి వచ్చారు. అయితే.. అక్కడకు వచ్చిన అభిమాని దివ్యాంగుడు.

దీంతో పైకి లేచి బాలయ్యతో మాట్లాడి ఫోటో దిగలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే పరిస్థితి అర్థం చేసుకున్న బాలయ్య తానే మోకాళ్ళ మీద కూర్చుని అభిమానితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” మా బాలయ్యది మంచి మనసు. ఏ హీరోకి ఇంత గొప్ప మనసు ఉండదు. జై బాలయ్య ” అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.