గుండు కొట్టించుకుని షాక్‌ ఇచ్చిన సురేఖ వాణి.. ఎందుకంటే (వీడియో)

నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన సురేఖ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండు తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అలాగే తన కూతురు సుప్రీత తో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తల్లి కూతుర్లు ఇద్దరు పొట్టి పొట్టి బట్టలతో దర్శనమిస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తారు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా సురేఖ వాణి గుండు కొట్టించుకున్నట్లు తెలుస్తుంది. కూతురు సుప్రీత తో కలిసి సురేఖ తిరుమల వెళ్లినట్లు తెలుస్తుంది. కాలీ నడకన శ్రీవారిని దర్శించుకున్న తల్లి కూతుర్లు తిరుపతిలో సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఈ క్రమంలోనే సురేఖ తన తలనీలాలను కూడా శ్రీవారికి అర్పించుకుంది.

ఇక ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన ప్రేక్షకులు..” ఎప్పుడూ ఇంత పద్ధతిగా ఉండవచ్చు కదా. ఎందుకు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ అందరితోనూ ఛీ అనిపించుకుంటారు. ఇప్పుడు మీరు షేర్ చేసిన ఈ ఫోటోలకి ఒక బ్యాట్ కామెంట్ కూడా రాదు చూడండి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)