ఇన్నాళ్లు ఊరుకున్న.. ఇక అస్సలు సహించను.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ నటి అనన్య నాగళ్ళ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా దిల్ రాజు హ‌జ‌ర‌య్యారు. ఆయ‌న మాట్లాడుతూ ఈ మూవీ యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు దిల్ రాజు. ఆ సినిమాకు సంబంధించి కొంతసేపు మాట్లాడిన తరువాత.. సంక్రాంతి సినిమాల బరిలో తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి మండిపడ్డాడు. దిల్ రాజు మాట్లాడుతూ నిన్న హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి గారి నా గురించి చాలా మంచిగా చెప్పారు.

Srikakulam Sherlockholmes Trailer Launch Event | Dil Raju | Prabhavathi | Friday Poster - YouTube

కానీ కొన్ని మీడియా సంస్థలు కొన్ని కాదు కేవలం రెండు ప్రముఖ మీడియా సంస్థలు ఆయన మాటలను తప్పుగా మార్చి ప్రచురించాయి. ఇన్నాళ్లు నాకెందుకులే అని ఊరుకున్నా.. ఇకనుండి అసలు సహించేది లేదు.. తాటతీస్తా.. హనుమాన్ అనే చిన్న సినిమాకు నేను థియేటర్స్ లేకుండా చేస్తున్నాను అని వార్తలు రాస్తున్నారు. మీకు తెలుసా..? ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా ధియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి తెలంగాణ ఏరియాలో చూసుకుంటే మహేష్ బాబు గారి గుంటూరు కారం కి ఎక్కువ థియేటర్లు ఇస్తే.. ఆ తర్వాత హనుమాన్‌కు ఎక్కువ థియేటర్లు ఉన్నాయి.

Producer Dil Raju's Shocking comments on media | Hanuman, Guntur Kaaram, Eagle | Gulte.com - YouTube

వెంకటేష్ గారి సైంధ‌వ్‌కి, నాగార్జున గారి నా సామిరంగ కి ఎక్కువ థియేటర్స్ దొరకలేదు. వాళ్ళు పెద్ద హీరోలే కదా..? ఆ విషయాలు మీకు అర్థం కావడం లేదా.. ? నేను జనవరి 12న తమిళ డబ్బింగ్ సినిమా రిలీజ్ చేస్తున్నానని మీరు రాసుకొస్తున్నారు. మీకు ఎవరు చెప్పారు..? ఆ సినిమాని నేను పోస్ట్ ఫోన్ చేయించా. తెలిసి మాట్లాడితే బాగుంటుంది.. నేను ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేస్తూ విమర్శించడం ఈ ప్రముఖ మీడియాలకు బాగా అలవాటైపోయింది.. మళ్ళీ చెబుతున్న నా జోలికి వస్తే తాటతీస్తా అంటూ రిప్లై ఇచ్చాడు.