సలారోడి 17 రోజుల కలెక్షన్స్ ఇవే.. పండగ చేసుకుంటున్న రెబల్ అభిమానులు.‌.!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన మూవీ ” సలార్ “. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుని సృష్టించిందనే చెప్పొచ్చు.

హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్న.. పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించిన.. సినిమా మాత్రం మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా యొక్క 17 రోజుల కలెక్షన్స్ వచ్చాయి.

ఈ సినిమాకి రూ. 336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెంన్‌ కావాలంటే రూ. 338 కోట్ల షేర్ను రాబట్టాలి. 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ. 319.11 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ. 18.89 కోట్ల షేర్ ని వసూల్ చేయాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా 17 రోజులు కలెక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.