నాని, వేణు కాంబోలో కొత్త సినిమా.. ఏ జానర్ లో అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకోవాలంటే ఎవ‌రైనా చాలా కష్టపడాల్సి వస్తుంది. అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం సాధారణ విషయం కాదు. అలా ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్టార్‌గా మారిన వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఇక నాని తాను నటించే ప్రతి సినిమా సినిమాకి డిఫరెన్స్ చూపిస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇటీవల నాని.. బలగంతో సూపర్ హిట్ కొట్టిన కమెడియన్ వేణు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరించనున్నాడు.

Nani on why he wants to work with Balagam director Venu Yeldandi - I was  astonished that…

గ‌తంలో వేణు బలగం సినిమాకి కూడా దిల్ రాజా ప్రొడ్యూసర్ కావడంతో ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సినిమాలో ఎంత దమ్ము ఉన్నా కూడా దానికి పబ్లిసిటీ చేసి సినిమాను పెద్ద సక్సెస్ రావ‌టానికి దిల్ రాజు కూడా ఓ కార‌ణం. ఇప్పుడు నానితో చేసే సినిమా విషయంలో మొదటి నుంచి చాలా క్లారిటీగా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడట. ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకోవాలని వేణు ప్లాన్ చేస్తున్నాడని.. అందులో భాగంగానే నానిని ఒక డీసెంట్ క్యారెక్టర్ లో నాని ని చూపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కంప్లీట్ లవ్ స్టోరీ గా రానుందని తెలుస్తోంది.

నానితో బలగం వేణు సినిమా.. కాంబో సెట్ చేసిన దిల్ రాజు?

ఈ సినిమా కోసం నాని కూడా తన పూర్తి అఫర్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడట. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టాలని ఉద్దేశంతో నాని ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వస్తుంది అనేదానిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ సినిమా తొందర్లోనే సెట్స్ పైకి రానుందట. ఈ సంవత్సరంలోనే సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం వేణు తనకంటూ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తిరుగులేని ముద్ర వేసుకుంటాడు. కనుక కచ్చితంగా వేణు ఈ సినిమాతో సక్సెస్ సాధించి తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకోవడం ఎంతైనా అవసరం.