బాలయ్య సినిమాలో కేజిఎఫ్ నటుడు కీలక పాత్ర… కాంబో మస్తు ఉంటది అంటున్న ఫ్యాన్స్..!

నందమూరి నటసింహం బాలయ్య మరియు దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉండనుందని.. ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ పాత్రలో మొదట సునీల్ శెట్టి పేరు వినిపించింది.

కానీ తాజాగా సంజయ్ దత్ పేరు వినిపిస్తుంది. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రలో సంజయ్ దత్ ను తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ వండర్ ఫుల్ గా ఉండనున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుందట.

అలాగే ఈ సినిమా బాలయ్య టైపు యాక్షన్ డ్రామా కాదని.. ఇదొక ఫ్యామిలీ బ్రాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.