పాలల్లో ఈ రెండిటిని కలిపి త్రాగడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే తప్పక అలవాటు చేసుకుంటారు..

ప్రయోజనాలు తెలిస్తే తప్పక అలవాటు చేసుకుంటారు..
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలుసు. అయితే రోజుకు ఒక గ్లాస్ పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. పాలను తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎముకలు ధృడంగా మారుతాయి. దంతాలు గట్టిపడటం, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం.. అలా అనేక విధాలుగా పాలు మన ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే సాధారణ పాలన తాగడం బదులుగా పాలలో ఇప్పుడు చెప్పే రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మరింత పోషకాలు లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

పాలలో వీటిని కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇంతకీ అవేంటో ఒకసారి చూద్దాం. సాధార‌ణ‌ పాలను తాగడానికి బదులుగా.. పాలలో శొంఠి, యాలుకలను జత చేసుకుని తాగడం వల్ల శరీరానికి మరింతగా మేలు కలుగుతుంది. పాలల్లో శొంఠి, యాలకులు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడమే కాకుండా.. రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండడానికి సహకరిస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుతుంది. శొంఠి, యాలకులు కలిపిన ఈ పాలను తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు. నీరసం, బలహీనతలు కూడా ఈ శొంఠి, యాలుకల పాలను తాగడం వల్ల దూరమవుతాయట.

ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్లు, వాతావరణ మార్పులతో వ‌చ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చెక్ పెడుతుంది. దగ్గు, గొంతు నొప్పి, జలుబు లాంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఇవి ఎంతో ఉపశమనం కలిగిస్తాయి. ఈ సమస్య కు చెక్ పెట్టవచ్చు. ఈ పాలను ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక టీ స్పూన్స్ శొంఠి పొడి, ఒక‌టిన్న‌ర‌ టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని రోజు రాత్రి పడుకునే ముందు త్రాగాలి. ఇలా త్రాగడం వల్ల అనారోగ్య సమస్యలు, పై చెప్పిన సమస్యలన్నీటికి చెక్‌ పెట్టవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను ఈ పాలు వెంటనే తగ్గిస్తాయి.