రకుల్ ధరించిన ఈ సింపుల్ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అంబానీ కూడా ఇంత ఖరీదైనవి కట్టడేమో..!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈమె ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో డీల పడిపోయింది.

ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తుంది రకుల్. ఇక ఇదిలా ఉంటే తాజాగా రకుల్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సింపుల్ అండ్ స్టైలిష్ ట్రెడిషనల్ వేర్ లో కనిపించి హీట్ ఎక్కిచ్చింది.

అయితే అసలు ఈ డ్రెస్ ధర ఎంత ఉంటుందో అని పలువురు విచారించారు. ఇక ఈ డ్రెస్ ధర చూసి వారు భారీగా షాక్ అయ్యారు. మానిక నిధి అనే బ్రాండ్ డిజైన్ చేసిన ఈ డ్రెస్ అక్షరాల 85 వేలు. ఇక ఈ డ్రెస్ ధర చూసి కొందరు.. ఈ డ్రెస్ ధరతో షాపే పెట్టుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతం రకుల్ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.