” ఇక నుంచి అలాంటి పాత్రలు చెయ్యను “.. విజయ్ సేతుపతి బిగ్ డెసిషన్..!

మన సౌత్ సినిమా దగ్గర ఉన్న అతి కొద్ది మంది మంచి యాక్టర్స్ లో విజయ్ సేతుపతి ఒకరు. ఈయన తన విలక్షణ నటనతో ఎన్నో సినిమాలు చేశాడు. హీరోగా సహాయ నటుడుగా గెస్ట్ రోల్స్ లో అలానే విలన్ గా నటించి ఎంతోమంది ప్రేక్షకులను సైతం సంపాదించుకున్నాడు.

ఇక ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి నాన్నగా నటించి ఫుల్ పాపులర్ అయిపోయాడు. ఇక రీసెంట్ గానే ” జవాన్ ” సినిమాలో విలన్ గా నటించి మొదటగా తాను విలన్ గా బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి మాట్లాడుతూ..” నేను రానున్న రోజుల్లో ఇంకా విలన్ గా కానీ గెస్ట్ రోల్స్ లాంటి వాటిలో కానీ నటించకూడదని డెసిషన్ తీసుకున్న ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్త విన్న ఈయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.