ఏంటి .. బన్నీ ఆఖరికి నువ్వు కూడా అలా చేస్తున్నావా..? ఇక ప్రపంచం ఏం బాగుపడుతుంది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసిడెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. కానీ ఆ సినిమా కంటే ముందే ఇంకొక సినిమా చేయాలి అని డిసైడ్ అవుతున్నాడు బన్నీ. బడా డైరెక్టర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ తో మన ముందుకు రాబోతున్నాడు బన్నీ .

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ విషయం పక్కన పెడితే రీసెంట్గా బన్నీ చేసిన పని అభిమానులను తీవ్రంగా హార్ట్ చేస్తుంది. బన్నీ ఎంత ఎదిగినా సరే టాలీవుడ్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు . తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయడానికి బన్నీ ఎక్కువగా ఆసక్తి చూపుతాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా బన్నీ ముంబైలో కోట్లు ఖర్చు చేసి ఒక ఇల్లు కొనుక్కున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

బన్నీ ముంబైకి తరచూ వెళ్ళి వస్తూ ఉంటాడు . స్నేహ రెడ్డికి కూడా అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ . అంతేకాదు పుష్ప తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ లో జరిగే ప్రతి పార్టీలోకి ఆయనకు ఇన్విటేషన్ అందుతుంది . ఈ క్రమంలోనే వెళ్ళిన ప్రతిసారి హోటల్లో లేక ఫ్లాట్ రెంటుకు తీసుకోవడం ఇబ్బందికరంగా ఉందట. అందుకే ముంబైలో ఇల్లు కొనేశాడట . అయితే ఈ విషయాన్ని మాత్రం కొందరు జనాలు తప్పుపడుతున్నారు. నువ్వు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నావా..? అందుకే అక్కడ ఇల్లు కొనుక్కున్నావా..? నీలాంటి టాలీవుడ్ బడా హీరో కూడా బాలీవుడ్ కోసం ఎగబడితే ఇక సినిమా ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది బన్నీ అంటూ కొందరు ఫ్యాన్స్ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు..!!