త్రిష మూవీ ఆఫర్ కొట్టేసి రీఎంట్రీ కి సిద్ధమైన సమంత.. త‌గ్గేదేలే అంటూన స్టార్ బ్యూటీ..

త్రిష ఆఫర్ కొట్టేసి రీఎంట్రీ కి సిద్ధమైన సమంత.. త‌గ్గేదేలే అంటూన స్టార్ బ్యూటీ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లో సమంత ఒకటి. ఒకప్పుడు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ దాదాపు తెలుగు అగ్ర హీరోల అందరి సరసన నటించింది. ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో ఏడాది సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేసిన‌ ఈ బ్యూటీ.. నిన్న మొన్నటి వరకు మయోసైటీస్ ట్రీట్మెంట్ చేయించుకుంది.

ఇక తాజాగా స్యామ్‌ రీఎంట్రీకి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే సమంత చేయబోయే ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరుల్ అవుతున్నాయి. సమంత రీ ఎంట్రీ బాలీవుడ్ సినిమాతో ఉండబోతుందని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న భారీ ప్రాజెక్ట్ ది బుల్.. పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన 2,3 రోజుల్లోనే రానుంది.

వ‌చ్చే ఏడాది రంజాన్ పండుగ లక్ష్యంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ మూవీలో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలి అనే అంశంపై చాలా చర్చలు జరిగాయని.. ఇటీవల సౌత్ హవ బాలీవుడ్ పై ఎక్కువ ఉండడంతో.. షారుక్ కూడా ఎలాగైనా హిట్ కొట్టాలని ఉద్దేశంతో సౌత్ హీరోయిన్ ని సెట్ చేయాలని సలహా ఇచ్చాడట. దీంతో ముందుగా సల్మాన్ ఖాన్ కి జోడిగా త్రిషను భావించారని.. కానీ ఆమె అజిత్ కొత్త సినిమాతో పాటు, చిరంజీవి – వశిష్ట కాంబో సినిమాల్లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. డేట్స్ ఎడ్జెస్ట్ చేయ‌లేక పోయింద‌ట‌.

దాంతో ఇష్టం లేకున్నా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ నుంచి త్రిషా తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో సమంతను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక త్వరలోనే కం బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న స‌మంతా.. సిటాడిల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ ప్రమోషన్స్ తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కథలు వింటుందని తెలుస్తుంది. ఇక‌ ఇప్పటికే ది బుల్ కథ స్యామ్‌ దగ్గరకు వెళ్లిందని.. దానికి స్యామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.