సైబర్ నేరగాళ్ల వలలో అవార్డు విన్నింగ్ బ్యూటీ.. ఆ భయంతోనే అంత డబ్బు పోగొట్టుకుందా..?!

వెండితెరపై త‌న న‌ట‌న‌తో ఎంతో ఖ్యాతి పొంది ఎనో అవార్డులు ద‌క్కించుకుంది. అయితే అదంతా రీల్‌ జీవితం. కానీ ప్రస్తుతం లైఫ్ లో మాత్రం సైబర్ దొంగలు అద్భుత న‌ట‌న‌కు ఆమె బుక్ అయిపోయింది. లక్షల‌ రూపాయలను పోగొట్టుకొని సైబర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. తెలివైన న‌ట్టిగా పేరున్న ఆమె సైబర్ దొంగల చేతికి ఎలా చిక్కింది.. ఆమె ఎలా మోసపోయింది.. అలాంటి ఫోన్లు వచ్చినప్పుడు మనం ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పుకోవాలో.. ఎలా రియాక్ట్ కావాలో తెలుసుకోవడానికి ఇది ఓ అనుభవం. తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ సినిమాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకుని.. స్టార్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది అంజలి పాటేల్‌ ఈ పేరు వినగానే టక్కున తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుకు రాకపోవచ్చు.

కానీ నా బంగారు తల్లి మూవీ లీడ్ క్యారెక్టర్ అంటే ఠ‌క్కున గుర్తుకు వస్తుంది. ఆ సినిమాకు ఆమె నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీ, మరాఠి సినిమాల్లో బిజీగా గడుపుతుంది. తాజాగా ఆమెకు అనుకొని ఎదురు దెబ్బ తగిలింది. సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్న ఈమె లక్షలు డబ్బును కోల్పోయింది. డిసెంబర్ 25న దీపక్‌ శర్మ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి ఫెడెక్స్ ఉద్యోగిగా చెప్పి ఆమె పేరుతో ఒక పార్సెల్ వచ్చిందని.. అది డ్రగ్స్ తో ఉందని.. తైవాన్ లో పట్టుబడినట్లు చెప్పుకొచ్చాడు. పార్సిల్ లోనే ఆధార్ కార్డు కాపీ ఉందన్నాడు.

దీంతో డ్రగ్స్ నేరం ఆమె మీద పడే అవకాశం ఉందని భయపడిన అంజలి.. తన ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందని భయపడి ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదిస్తారని వివరించింది. ఇది జరిగిన కాసేపటికి ఆమెకు సైబర్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేసినట్లుగా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఆమె ఆధార్ కార్డ్‌ బ్యాంక్ ఖాతాలకు కనెక్షన్ ఉందని.. ఆమె మనీలాండరింగ్ కేసులో చిక్కుకునే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. దీంతో కన్ఫ్యూజ్ అయిన ఆమె భయాందోళనలో పడింది. ప్రాసెసింగ్ ఫీ అని మొదట రూ96,525 వరకు తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఆ తర్వాత కొంతసేపటికి ఈ వ్యవహారంలో విచారణ కోసం వెంటనే రూ4.83 లక్షలు పంపాలి అంటూ మరోసారి ఫోన్ చేశారు.

అయితే ఆమె అస్సలు ఆలోచించకుండా ఆధార్‌ దుర్వినియోగం అవ్వకూడదనే ఉద్దేశంతో అతడు అడిగినంత డబ్బును ఇచ్చేసింది. కాసేపటికి తను మోసపోయినట్లు గుర్తించిన అంజలి సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే మొత్తంగా ఈ ప్రాసెస్‌లో రూ.5.79 లక్షల వరకు నష్టపోయింది. ప్రస్తుతం ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తున్న పోలీసులు సైబర్ నేరస్తుల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే స్టార్ సెలబ్రిటీలు కూడా ఇలాంటి మాయమాటలను అంత సులభంగా నమ్మి ఎలా మోసపోతున్నారు అంటూ అందరూ షాక్ అవుతున్నారు.