ఫ్యామిలీతో అలా చేస్తూ ఫోటోలను షేర్ చేసిన మహేష్.. వైరల్ అవుతున్న పిక్స్…!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ విజయాలని అందుకున్న ఈయన ప్రస్తుతం ” గుంటూరు కారం ” అనే సినిమాతో ప్రేక్షకుల‌ ముందుకు రానున్నాడు.

ఇక ఈ సినిమాలో శ్రీలీల‌ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని తెరికెక్కిస్తున్నాడు. ఇక జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూట్ కంప్లీట్ చేసుకున్న మహేష్ తన ఫ్యామిలీతో కలిసి చిన్న వెకేషన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే.

ఇక ఈ వెకేషన్ నుంచి తన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న హ్యాపీ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు మహేష్. తన భార్య పిల్లలు, తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి మహేష్ దిగిన పిక్స్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.