అటు నుండి వాళ్లు..ఇటు నుండి వీళ్లు.. మధ్యలో బర్గర్లా ఎన్టీఆర్ ని నలిపేస్తున్నారే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే నందమూరి అభిమానులను తీవ్రంగా టెన్షన్ పెట్టేస్తుంది . ఎన్టీఆర్ను బర్గర్ కన్నా దారుణంగా నలిపేస్తున్నారా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఒకపక్క కొరటాల శివ సినిమా కోసం బాగా కష్టపడుతుంటే మరొక పక్క ఆయనకు ఇష్టం లేని నచ్చని రాజకీయ రంగును పూయడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది జనాలు అంటూ నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు .

అసలు ఎన్టీఆర్ ఏ విషయంలో తల దూర్చకపోయినా సరే ఆయన పేరుని అక్కడ ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ కి రాజకీయ రంగు అద్దుతున్నారు. రీసెంట్గా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తారక్ ఫ్లెక్సీలను బాలకృష్ణ తీయించేయడం ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో మనకు తెలిసిందే . దీంతో నందమూరి ఫ్యాన్స్ రెండుగా డివైడ్ అయిపోయారు . జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యను తిడుతుంటే ..

బాలయ్య ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని తిడుతూ.. నీకు నందమూరి ట్యాగ్ అసలు రాదు అంటూ ఆయన ట్రోల్ చేస్తున్నారు . ఒకపక్క సినిమా షూట్లతో ఎన్టీఆర్ సతమతమైపోతుంటే మరొకపక్క ఇలాంటి వార్తలు ఆయనను బాధ పెట్టేస్తున్నాయి .దీంతో నందమూరి ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు. ప్రెసెంట్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది..!!