ఈ వయసులో అలాంటి సర్జరీ చేయించుకోబోతున్న స్నేహ.. ఫ్యాన్స్ బూతులు..ఎందుకంటే..?

స్నేహ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . అందాల ముద్దుగుమ్మ చక్కటి రూపం .. అంతకుమించిన మంచి మనసు.. ఎవరినైనా సరే ప్రేమగా పలకరించే గుణం ..ఆమె సొంతం . సినిమా ఇండస్ట్రీలో స్నేహకు చాలామంది ఫాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా హోమ్లీగా కనిపించే స్నేహ అంటే ఫ్యామిలీ లేడీస్ పడి చచ్చిపోతూ ఉంటారు. ఆమె చీర కట్టి తలలో పూలు పెట్టి నుదుట బొట్టు పెట్టింది అంటే అచ్చం మహాలక్ష్మి లానే ఉంటుంది అంటూ పొగిడేస్తూ ఉంటారు .

కాగా సినిమా ఇండస్ట్రీలో హోమ్లీ లేడీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన స్నేహ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు అభిమానులను భయపెట్టేస్తుంది. హీరోయిన్ స్నేహ బెల్లీఫట్ సర్జరీ చేయించుకోబోతుందట . పిల్లల పుట్టిన తర్వాత ఆమెకు ఫ్యాట్ బాగా పెరిగిపోయిందట. ఆ కారణంగానే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మళ్లీ తన కెరీర్ ని సక్సెస్ బాటలో పెట్టడానికి హీరోయిన్ స్నేహ తన బాడీని ట్రాన్స్ఫారం చేసుకుంటుందట .

ఇప్పటికే రకరకాల ఎక్ససైజులు చేసిన పెద్దగా ఉపయోగం లేకపోవడంతో .. ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందట . అయితే చాలామంది స్నేహ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఆమెను బూతులు తిడుతున్నారు . పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నీకు ఇలాంటి ఆపరేషన్ అవసరమా ..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!!