ఫైనల్లీ..పెళ్లిపీటలెక్కబోతున్న మన ప్రభాస్ హీరోయిన్.. ? బోల్డ్ బ్యూటీకి కాబోయే భర్త ఎవరో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . హీరోయిన్ శ్రద్ధాదాస్ పెళ్లి చేసుకోబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . నిన్న మొన్నటి వరకు ప్రేమ – పెళ్లి -దోమ ఏదీ లేదు అంటూ నీతి వ్యాఖ్యలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. శ్రద్ధాదాస్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకుంది.

మరీ ముఖ్యంగా ఆర్య 2 , డార్లింగ్ సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. కాగా ఆ తర్వాత అడపా దడపా రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్న శ్రద్దాదాస్ .. ఈ మధ్యకాలంలో బోల్డ్ ఫొటోస్ ఎక్కువగా షేర్ చేస్తూ వచ్చింది. ఈ ముద్ద గుమ్మకి 32 ఏళ్ళే. అయినా సరే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోవాలనుకుంటుందట . ముంబైకి సంబంధించిన బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడు పెళ్లి న్యూస్ జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది.

ప్రస్తుతం శ్రద్దా దాస్ వరుస వెకేషన్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. శ్రద్దా దాస్ బుల్లితెరపై ఢీ లాంటి షోలలో కూడా సందడి చేసింది. ప్రస్తుతం శ్రద్దా దాస్ కొన్ని చిన్న చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది. చూద్దాం మరి ఈ ముద్దుగుమ్మ పెళ్లి పై ఏ విధంగా స్పందిస్తుందో..??