ఏ ఆర్ రెహమాన్ ఇస్లాంలోకి మారడం వెనుక ఇంత కథ నడిచిందా.. అసలు కారణం ఏంటంటే..?

ఒకప్పుడు మ్యూజిక్ సెన్సేషన్ ఏ.ఆర్.రెహమాన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కంటే కోట్లాదిమంది ఫ్యాన్స్ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆయన మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన పాటలు.. అభిమానుల చెవులలో మారుమోగుతూనే ఉంటాయి. ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాలుకు అద్భుతమైన సంగీతం అందించిన రెహమాన్.. సంగీత రంగ ఎదుగుదలకు చేసిన కృషి అంతా ఇంతా కాదు. రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకొని పెద్ద సక్సెస్ను అందుకున్న ఏ.ఆర్.రెహమాన్.. ఏషియాలోనే తొలిసారిగా ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న వ్యక్తిగా రికార్డ్ కూడా సృష్టించాడు.

ఇక రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. తర్వాత ఇస్లాంలోకి మారిన ఆయన పేరును కూడా ఏ.ఆర్.రెహమాన్‌గా మార్చుకున్నాడు. అయితే ఇస్లాంలోకి ఎందుకు మారాడు గతంలో వివరించాడు రెహమాన్. తండ్రి ఆర్‌.కే.శేఖర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మరణించిన తర్వాత.. రెహమాన్ సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాడు. తన మొదటి ప్రాజెక్ట్ రోజా విడుదలకు కొంత సమయం ముందే కుటుంబంతో సహా ఇస్లాంను స్వీకరించాడు. సాధారణంగా అయితే రెహమాన్ మతవిశ్వాసాలను అసలు నమ్మరు.

సూఫీ మతం కుటుంబాన్ని ఆకర్షించడంతో.. రెహ్మాన్ రోజా విడుదలకు ముందు కుటుంబం మొత్తం ఇస్లాం మతంలోకి మారాల్సి వచ్చింది. అతని తల్లి కరీమా బేగం చివరి నిమిషంలో క్రెడిట్ లలో రెహమాన్ పేరును మార్చాలని పట్టు పట్టడంతో.. ఆయన పేరు ఏ ఆర్ రెహమాన్ గా మార్చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ రెహమాన్ గానే ఆయన ప్రసిద్ధి చెందారు. ఇస్లాంలోకి మారిన తర్వాత విజయవంతం కాగలరా అని చాలామంది ఏఆర్ రెహమాన్ ని అడుగుతారు.. కానీ ఇప్పటివరకు ఆయనే అలాంటి ప్రశ్నలకు ఎప్పుడు సమాధానం చెప్పలేదు.