“గుంటూరు కారం” కోసం మహేశ్ అలా చేస్తున్నాడా..? కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా..!

ప్రజెంట్ సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమాకి సంబంధించిన న్యూస్లు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా గుంటూరు కారం . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. జనరల్ గా మహేష్ బాబు తన సినిమాల విషయంలో ఎప్పుడు టెన్షన్ పడడు .

చాలా కూల్ గా .. సైలెంట్ గానే నిర్ణయాలు తీసుకుంటారు . అంతేకాదు ప్రమోషన్స్ లో కూడా ఎక్కడ హడావిడి లేకుండా చాలా సాఫ్ట్ గా ప్రశాంతంగా ప్రమోషన్స్ ఫినిష్ చేస్తారు. కానీ గుంటూరు కారం విషయంలో మాత్రం మహేష్ బాబు ఎందుకో టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ప్రమోషన్స్ పనులు సరిగ్గా జరుగుతున్నాయా..? లేదా..? అని ప్రతి విషయాన్ని ఆయనే స్వయాన ఫోన్ చేసి మరి కనుక్కుంటున్నాడట.

అంతేకాదు గుంటూరు కారం సినిమా హిట్ అవ్వాలి అని ఇంట్లో ప్రత్యేకంగా పూజలు కూడా చేయిస్తున్నాడట. ఇప్పటివరకు మహేష్ బాబు తన కెరియర్ లో ఎప్పుడు కూడా ఇలా చేయలేదు .ఫస్ట్ టైం గుంటూరు కారం సినిమాకు మాత్రమే ఇలా చేస్తూ ఉండడం గమనార్హం. దీమ్రో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??