సీక్వెల్ వైపే పరుగులు పెడుతున్న నందమూరి హీరోలు… ఎవరి దారి ఎటు అంటే..!

నందమూరి హీరోలు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తమదైన గుర్తింపు సంపాదించుకుంటూ ఎప్పటికప్పుడు వరుస బ్లాక్ బస్టర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక తాజాగా నందమూరి హీరోల సినిమాలపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. కళ్యాణ్ రామ్, తారక్, బాలయ్య లు కూడా ఎక్కువ సీక్వెల్స్ వైపే పరుగులు తీస్తున్నారు.

కళ్యాణ్ రామ్ డెవిల్ సీక్వెల్ రెడీ అవుతుందని అన్నారు. ఇక ఈమధ్య సడన్ సక్సెస్ అందుకున్న బింబిసారాకు కూడా సీక్వెల్ చేయబోతున్నారు. ఇక 2024 లో బింబిసారా సినిమా సీక్వెల్ స్టార్ట్ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న మూవీ దేవర.

తారక్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చేయడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇక అనంతరం కొంత గ్యాప్ ఇచ్చి సీక్వెల్ పనులు మొదలుపెట్టనున్నారు కొరటాల శివ. ఇక దేవరాకు మాత్రమే కాదు.. ట్రిపుల్ ఆర్ కి కూడా సీక్వెల్ ఉంటుందనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు అఖండ సీక్వెల్ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఇలా నందమూరి హీరోలు అంతా కూడా సీక్వెల్ వైపే పరుగులు తీస్తున్నారు. మరి ఎవరి దారి ఎటో చూడాలి మరి.