ఆ సూపర్ హిట్ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసిన జాన్వి కపూర్.. కరణ్ జోహార్ క్లారిటీ..

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్ – అలియా భట్ కలసి నటించిన మూవీ దుల్హనియా. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే దీన్ని థర్డ్ పార్ట్ కూడా రిలీజ్ కానుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలియా భట్ స్థానంలో దర్శక,నిర్వాతాలు జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారనే టాక్ బాలీవుడ్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

దీని పై నటుడు, దర్శకుడు కరణ్ జోహార్ మాట్లాడుతూ ప్రతిరోజు నిద్రలేవగానే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో రూమర్స్ వినపడుతూనే ఉన్నాయి.. నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ఏది పడితే అది రాసేస్తున్నారు అలాంటి వార్తలను ఎవరు నమ్మవద్దు అంటూ అభిమానులకు వివ‌రించాడు కరణ్.

సరైన సమయం వచ్చినప్పుడు మేము దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం.. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తన ఇన్‌స్టా వేదికపై చెప్పుకొచ్చాడు. ఇటీవల కాఫీ విత్ కరణ్‌ ఎపిసోడ్‌లో జాన్వి కపూర్ సందడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఈ రూమర్లు మొదలయ్యాయి.