ఆఖరికి మహేశ్ పరిస్ధితి ఇంత దారుణంగా దాపురించింది ఏంటి బ్రో..!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న రెండే రెండు పేర్లు గుంటూరు కారం వ్శ్ హనుమాన్ . ఆశ్చర్యం ఏంటంటే గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ ఆయనకే పోటీ ఇచ్చే విధంగా హనుమాన్ సినిమాను ఆయన సినిమా రిలీజ్ అవుతున్న తేదీనే రిలీజ్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ సంబంధించిన వార్తలు మనం ఎన్నో చూసాం . రీసెంట్గా బుక్ మై షో లో మహేష్ బాబుని దాటిపోయాడు తేజ . హనుమాన్ సినిమాను ఎక్కువ మంది టికెట్స్ బుక్ చేసుకోవడం గుంటూరు కారం సెకండ్ ప్లేస్ లో ఉండడం మహేష్ ఫ్యాన్స్ కు మింగుడు పడడం లేదు .

అంతేకాదు ప్రమోషన్స్ లో కూడా హనుమాన్ టీం చాలా చక్కగా ముందుకు వెళ్తుంది . గుంటూరు కారం ప్రమోషన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అసలు పట్టించుకోవడం లేదు . అంతేకాదు కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చేస్తున్న పనికి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. అంతేకాకుండా పలు పోల్స్ లో మహేష్ బాబు కన్నా తేజ సజ్జా నే ముందున్నాడు. హనుమాన్ సినిమాతో ఆయన చరిత్ర తిరగరాయబోతున్నాడు అని మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఆల్రెడీ స్టార్ స్టేటస్ అందుకొని తన సినిమాల కోసం ఈ రేంజ్ లో తన సినిమా హిట్ అవ్వాలని ఈ రేంజ్ లో తాపత్రయపడటం చూస్తుంటే ఆయనకు ఖచ్చితంగా తేజ బిగ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాడు అని ఆయనకే తెలుసని అంటున్నారు .

అంతేకాదు స్టార్ హీరో మహేష్ బాబుకి ఇలాంటి పరిస్థితి దాపురించడం ఏంటా..?? అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లని కొనియెచ్చు హనుమాన్ సినిమాని ఆపేయచ్చు . కానీ మహేష్ బాబు అలా చేయలేదు. హల్దీ కాంపిటీషన్ తోనే ముందుకెళ్తున్నాడు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయనను వెనకేసుకొని వస్తున్నారు.