గెట్ రెడీ ఫ్యాన్స్.. ఏ క్షణంలో అయినా ” గుంటూరు కారం ” మాస్ ట్రైలర్ రిలీజ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ హీరోయిన్స్ శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ ట్రైలర్ నిన్ననే వచ్చేయాల్సింది. కానీ కొన్ని అనివర్ణ కారణాలు మూలన వాయిదా పడింది.

 

ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మరింత ఆలస్యం అవ్వడంతో ఈ మూవీ ట్రైలర్ ని ఇవాళే రిలీజ్ చేయనున్నట్లుగా క్రేజీ బజ్ వినిపిస్తుంది. నిజానికి ముందు ప్రీ రిలీజ్ లోనే విడుదల చేద్దామని మేకర్స్ అనుకున్నారట. కానీ అది రోజు మారుతూ వస్తుండడంతో మొదటగా ట్రైలర్ వదిలేయాలని మేకర్స్ ఫీల్ అవుతున్నారట. ఇక దీంతో ఈ అవైటెడ్ ట్రైలర్ ఈరోజు ఏ టైంలో అయినా రిలీజ్ కావచ్చు. అందుచేత ఫ్యాన్స్ బి రెడీ.