జీడిపప్పు తింటే గుండె జబ్బులు కలుగుతాయా? ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ జీడిపప్పు తింటే బలం వస్తుంది అని తింటూ ఉంటారు. ఇందులో ఉండే పోషకాలను తెలుసుకుంటారు కానీ చెడు వ్యాధులను తెలుసుకోరు. జీడిపప్పు ఒక రుచికరమైన మరియు పోషకమైన ఆహారం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. అయితే కొంతమంది వ్యక్తులు జీడిపప్పు తినకూడదు.

జీడిపప్పులో క్యాలరీలు ఎక్కువ గా ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఫ్రై చేసిన జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. జీడిపప్పులో ఉండే ఫాస్పరస్ కిడ్నీలకు మంచిది కాదు. అలాగే ఇందులో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులు ఉన్నవారు ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు తక్కువగా తీసుకోవాలి.

అలాగే జీడిపప్పులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం ద్వారా డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినకూడదు. ఇక ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ. కడుపులో పుండ్లు ఉన్నవారు ఫైబర్ తీసుకోవడం వల్ల నొప్పి పెరగొచ్చు. అలాగే జీడిపప్పును మితంగా తినడం మంచిది. ఇక ఇన్ని అసౌకర్యమైన వ్యాధులు కలుగుతున్న ఈ జీడిపప్పుని చాలా తక్కువగా తినడం మంచిది.